ETV Bharat / state

Delivery in Ambulance: ఆన్​లైన్​లో వైద్యుల సూచనలు.. పురుడు పోసిన 108 సిబ్బంది

author img

By

Published : Jul 31, 2021, 3:06 PM IST

పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె అంబులెన్స్​లో ప్రసవించింది. 45 ఏళ్ల వయసున్న ఆ గర్భిణికి.. ఇది ఎనిమిదవ సంతానం కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలందర్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూలీ పని చేస్తూ పోషించుకుంటున్నారు.

Delivery in Ambulance
పురుడు పోసిన 108 సిబ్బంది

ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే చాలు. వారిని చక్కగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. కొన్ని సార్లు వారిని పెంచేందుకే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటింది ఓ మహిళ 108 వాహనంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనిలో ఏముంది చెప్పుకోవడానికి అనుకుంటున్నారా? కచ్చితంగా విశేషమే ఉంది. ఈ కాన్పు ఆమెకు ఎనిమిదవది.

ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన మస్తానమ్మ అనే గర్భిణికి వయస్సు 45 ఏళ్లు. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. నాయుడుపేటకు చెందిన అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ అయ్యాయి.

దీంతో... ఆన్​లైన్​లో వైద్యుల సూచన మేరకు అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. శిశువు మెడకు తగులుకుని ఉన్న జఠాయువును వారు తప్పించారు. మస్తానమ్మకు ఇది ఎనిమిదవ సంతానం కావడం విశేషం. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మస్తానమ్మ దంపతులు.. పిల్లలందర్నీ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: వీర్యం వినియోగానికి ఆ మహిళకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.