ETV Bharat / state

ఘనంగా వెలిగిన నమోజ్యోతి కార్యక్రమం

ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నమోజ్యోతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మనల్ని, దేశాన్ని, కరోనా నుంచి విముక్తి చేయాలని కార్యకర్తల ఇళ్ల ముందు జ్యోతి వెలిగించి ప్రార్థించారు. ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

a-well-lit-namo-jyoti-program-bjp-in-telangana
ఘనంగా వెలిగిన నమోజ్యోతి కార్యక్రమం
author img

By

Published : Mar 28, 2020, 7:53 AM IST

ఘనంగా వెలిగిన నమోజ్యోతి కార్యక్రమం

తెలంగాణలో నమోజ్యోతి కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు ఉత్సాహాంగా జరిపారు. పలువురు కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరీంనగర్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నమోజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో కార్యకర్తలు మోడీకి అండగా నిలవాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో మోదీ దేశ ప్రధానిగా ఉండటం ప్రజల అదృష్టం అని కొనియాడారు. కరోనాపై యుద్ధంలో మోదీ దేశానికి కొండంత అండ అని తెలిపారు.

ప్యాకేజితో రాష్ట్రంలో..

మోదీ ప్రకటించిన ప్యాకేజితో రాష్ట్రంలో 59 లక్షల మంది జాబ్​ కార్డుదారులకు ఉపాధి, ఉజ్వల గ్యాస్ 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు, 5.5 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్థులకు, 50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. అవి లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఆపద సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలు కూడా పార్టీలకు, కులాలకు అతీతంగా ఒకరికొకరు అండగా నిలవాలన్నారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యత అని సూచించారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.

తార్నాకలోని తన నివాసంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు నమోజ్యోతి కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఇంటికే పరిమితం అవుదాం.. కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకుందామని పేర్కొన్నారు. ప్రతిరోజు ఆకలితో అలమటిస్తున్న బీద ప్రజలకు కనీసం ఐదుగురికైనా అన్నదానం చేయాలని ఆయన సూచించారు.

మాజీ మంత్రి డీకే అరుణ తన ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించి నమోజ్యోతి కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి : ఎన్​ఓసీ పత్రాల కోసం డబ్బుల డిమాండ్..హోంగార్డు సహా మరో ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.