పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో కొందరు ఆకతాయిలు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైదరాబాద్‌లోని ఎన్‌టీబీనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని కోరారు.
నగరంలోని రోడ్ నంబరు 12లోని ఎన్‌టీ నగర్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులను కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. వారు ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లారు. ఆకతాయిలనుంచి విధ్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ.. ఆమె నగర సీపీ అంజనీ కుమార్, మేయర్ విజయలక్ష్మిలకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన మేయర్ ఈ విషయాన్ని బంజారాహిల్స్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉదయం, సాయంత్రం వేళలో పెట్రోకార్, బ్లూకోట్స్ సిబ్బందిని పాఠశాల వద్ద ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్ కళింగరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్