ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడులో దారుణం జరిగింది. దగ్గబాడుకు చెందిన ఇరప్పాన్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్... నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తున్నాడు..ఈ నేపథ్యంలో రాత్రి మద్యం మత్తులో భార్యపై దాడిచేస్తుండటంతో కుమారుడు మస్తాన్ వలి అడ్డుకున్నాడు.. దీంతో అక్కడే ఉన్న కత్తితో కుమారుడిపై దాడికి దిగారు..తాను రక్షించుకునే ప్రయత్నంలో క్రికెట్ బ్యాటుతో కొట్టడంతో తండ్రి ఇరప్పాన్కు తీవ్రగాయాలయ్యాయి...క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... అప్పటికే ఇరప్పాన్ మృతిచెందాడు.. కారంచేడు పోలీసులు కేసునమోదు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు
కృష్ణాజిల్లాలో మరో దారుణం
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఇదే ఘటన జరిగింది.. ఈదరలో తండ్రిని కుమారుడు... కత్తితో పొడిచి చంపాడు. ఘటనపై పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: దాతల సాయం... కాపాడును పసిప్రాణం