ETV Bharat / state

ఏపీ: ఆత్మవిశ్వాసం గీసిన చిత్రం... పవన్​ను కదిలించిన 'స్వప్న'0 - శ్రీకాకుళం జిల్లా వికాలాంగుల వార్తలు

చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసంతో ఏదో సాధించాలని దృఢ సంకల్పంతో ఆ యువతి ముందుకెళుతుంది. ఒకపక్క పేదరికం మరోవైపు అంగవైకల్యం వెనక్కి నెడుతున్నా... అంకుఠిత దీక్షతో బొమ్ములు గీస్తూ ఔరా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ బొమ్మగీసి ఆయన మన్ననలు స్వప్న కథ ఇది.

physically handicapped girl draws pawan kalyan image
ఏపీ: ఆత్మవిశ్వాసం గీసిన చిత్రం... పవన్​ను కదిలించిన 'స్వప్న'0
author img

By

Published : Sep 5, 2020, 5:51 PM IST

ఏపీ శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం నాయరాల వలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న నోటితో చిత్రాలు గీస్తూ అందరినీ అబ్బుర పరుస్తుంది. చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకుంది. తల్లి సత్యవతి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. స్వప్న దాతల సహకారంతో డిగ్రీ వరకు చదువుకుంది. ఏదో సాధించాలన్నా లక్ష్యంతో సాధన చేస్తూ చిత్రకళా రంగాన్ని ఎంచుకుని పలు చిత్రాలను గీస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మెచ్చుకునేలా చేసింది. స్వప్న బొమ్మలు గీయటంతోపాటు, డాన్స్, రన్నింగ్ లో సైతం ప్రతిభ కనబరుస్తుంది.

ఏపీ: ఆత్మవిశ్వాసం గీసిన చిత్రం... పవన్​ను కదిలించిన 'స్వప్న'0

జనసైనికులతోపాటు కొందరు దాతల సహకారంతో గాజుల షాపు పెట్టుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసి పుట్టినరోజు కానుకగా పంపించినందుకు ఆయన స్వప్నను అభినందిస్తూ.. త్వరలో కలుస్తానని చెప్పారు. దీంతో స్వప్న ఆనందానికి హద్దులు లేవు.

ఇదీ చూడండి: చమురు నౌకలో అగ్ని ప్రమాదం... మంటలు ఆర్పిన సహ్యాద్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.