ETV Bharat / state

World Record: ఏడు పదుల వయసు.. ఏడు నిమిషాల్లో వరల్డ్ రికార్డ్ - డా.కృష్ణ ఎదుల వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​

ఓ వృద్ధుడు అరుదైన ఘనత సాధించాడు. తన వయసును లెక్కచేయకుండా సాహసం చేసి అబ్బురపరిచాడు. అంతే కాకుండా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​లో స్థానం(Dr. Krishna Edula in Wonder Book of World Records )దక్కించుకున్నాడు. ఇంతకీ ఆయన చేసిన సాహసమేంటో తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి.

World Record
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​లో స్థానం సంపాదించిన డా.కృష్ణ ఎదుల
author img

By

Published : Nov 28, 2021, 5:03 PM IST

Updated : Nov 28, 2021, 5:31 PM IST

సాహసానికి వయసుతో పనిలేదని నిరూపించాడు ఓ వృద్ధుడు. ఏడు పదుల వయసులో అరుదైన ఫీట్ సాధించాడు. ఆయన సాహసానికి మెచ్చి వరల్డ్ బుక్​ ఆఫ్ రికార్డ్​లో(Wonder Book of World Records) స్థానం కల్పించారు. హైదరాబాద్​ నారాయణగూడకు చెందిన డా.కృష్ణ ఎదుల ఈ సాహసోపేతమైన ప్రదర్శన చేశారు.

సాహమేంటంటే...

స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా.. నేల్ బోర్డుపై పడుకొని 159 షాబాద్ బండరాళ్లను తన ఛాతిపై పగులగొట్టుకుని అబ్బురపరిచాడు. ఓ పాఠశాలలో జరిగిన ఈ ప్రదర్శనను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ముందు డా.కృష్ణ ఎదుల(Dr. Krishna Edula created wonder book of world record) ప్రదర్శించారు. 70 ఏళ్ల వయసులో ఏడు నిమిషాల్లో ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటిసారి అన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్​నెస్​తో ఉండటానికి... ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన ఫీట్ సాధించిన డా.కృష్ణ ఎదులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్( world record feet in seven minutes), ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , విశ్వం వరల్డ్ రికార్డ్స్, డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మెడల్స్​తో ఘనంగా సత్కరించారు.

Wonder Book Of World Record

ఈరోజు జీవీకే కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహించడం జరిగింది. 70 ఏళ్ల వయసులో ఆయన షాబాద్ బండలను తన ఛాతీపై పగలగొట్టడం నిజంగా సాహాసోపేతమైన నిర్ణయం. ఇది చాలా అద్భుతం. అందువల్ల ఆయన పేరును ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో నమోదు చేస్తున్నాం. కేవలం ఏడు నిమిషాల్లో ఈ ఫీట్​ను సాధించారు. - బింగి నరేందర్ గౌడ్ , వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా కోఆర్డినేటర్

నేను ఈరోజు చేసిన కార్యక్రమం సీనియర్ సిటిజెన్స్ కోసం చేయడం జరిగింది. 55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కీళ్ల నొప్పులు వచ్చి ఏం చేయలేం అని భావిస్తుంటారు. మనకు 60 ఏళ్లు దాటినా కూడా ఏదో చేయగలమనే నమ్మక వారి కలగడానికి ఈ కార్యక్రమం చేశాం. పిల్లలు, యువకులు కూడా క్రమశిక్షణతో ఉంటే జీవితంలో ఇలాంటిని సాధించగలం. ఇందులో రిస్క్ కూడా ఉంది. నాకున్న ధైర్యంతోనే ఈ ఫీట్ సాధించా. మూడు నెలల క్రితం కూడా ఇలాగే చేశాను. నేటి యువతరం కూడా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. - డాక్టర్ కృష్ణా ఏదుల

ఇదీ చూడండి:

Last Updated : Nov 28, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.