కొవిడ్ మహమ్మారి (Coronavirus) నుంచి కోలుకున్నా... బాధితుల ఆరోగ్యం మాత్రం కుదుటపడని పరిస్థితి. వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకున్నామని సంతోషించే లోపే రకరకాల అనారోగ్యాలు చుట్టు ముడుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి గుండె, ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని భావించారు. తాజాగా ఇప్పుడు కడుపులోని పేగులను సైతం వదలటం లేదని వైద్యులు చెబుతున్నారు. పేగుల్లో రక్తనాళాలకు రక్త సరఫరా నిలిచిపోయి చివరికి పుండుగా మారుతున్నట్టు గుర్తించారు.
అందరిలో ఈ ప్రభావం ఉంటుందన్న గ్యారెంటీ లేదని చెప్పారు. కానీ కరోనా ప్రభావం తీవ్రంగా పడిన వ్యక్తుల్లో ఈ ప్రభావ లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పేగుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (Intestinal Ulcer) వంటి కేసులు బయటపడుతున్నాయని వివరించారు. గత మూడు వారాల్లోనే ముగ్గురు రోగులు తీవ్రమైన కడుపు నొప్పితో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్లు కడుపులోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తించారు. పేగులు కుళ్లిపోయే దశకు చేరినట్లు వైద్యులు చెప్పారు.
బాధితుల్లో కొవిడ్ రాకున్నా యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపారు. పేగులకు రక్తప్రసరణ ఆగిపోయి రక్తగడ్డకట్టినట్లు (Intestinal Ulcer) గుర్తించారు. అక్కడ శరీర కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్‌గా మారినట్లు వైద్యులు నిర్ధారించారు. కడుపులో తీవ్రమైన నొప్పి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఈ మేరకు ఇటీవల పలువురు రోగులకు నిమ్స్‌లో చికిత్స అందించిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ బీరప్ప (Nims Doctor Beerappa)తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇదీ చూడండి: కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట!