ETV Bharat / state

IPL Betting: బెట్టింగ్​లో రూ.100 కోట్లు హాంఫట్.. అయినా..!​

100 Crores Lose in IPL Betting : ఐపీఎల్.. క్రికెట్‌ ‌అభిమానులతో పాటు బెట్టింగ్‌ రాయుళ్లకు పండగలా మారింది. సులభంగా డబ్బు గెలవచ్చనే ఆశ చూపించి అమాయకుల నుంచి బుకీలు రూ.కోట్లు దండుకుంటున్నారు. బాధితులకు సరదాగా మొదలైన బెట్టింగ్‌.. వ్యసనంగా మారుతోంది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు పోగొట్టుకోవటం బెట్టింగ్‌ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

IPL Betting
IPL Betting
author img

By

Published : Apr 16, 2023, 7:28 AM IST

100 Crores Lose in IPL Betting : రాష్ట్రంలో బెట్టింగ్‌పై నిషేధం ఉన్నా నిందితులు వివిధ మార్గాల్లో ఆ దందా నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పంటర్లను ఆకర్షించి.. పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆ దందా ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. డబ్బు వస్తుందనే ఆశతో అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్‌ పెట్టి నష్టపోతున్నారు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు సబ్‌ బుకీలు, కలెక్షన్‌ ఏజెంట్‌ను ఎల్బీనగర్ ఎస్​వోటీ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు చెప్పిన స్వీయ అనుభవాలు విని పోలీసులే విస్తుపోయారు.

సంస్థను ప్రారంభించి నష్టం రావడంతో : హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన అశోక్‌రెడ్డి గతంలో స్థిరాస్తి వ్యాపారం చేసి కొద్దికాలంలోనే భారీగా సంపాదించాడు. సరదాగా క్రికెట్‌ బెట్టింగ్‌ కాసే క్రమంలో లక్షల్లో ఆదాయం రావటంతో రెట్టింపు చేసేందుకు మళ్లీ మళ్లీ పందెం కాసేవాడు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో పాటు... స్నేహితులు, బంధువుల దగ్గర తీసుకొని పందెంకాశాడు. 12 ఏళ్లలో పలు దఫాలుగా సుమారు రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. అతను ఓ సంస్థను ప్రారంభించి నష్టాలు రావటంతో.. ఐపీ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

రూ.100 కోట్లు పోగొట్టుకున్నా మార్పు రాలేదు : కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న అశోక్‌రెడ్డి క్రికెట్‌బుకీ ‌అవతారం ఎత్తాడని పోలీసులు వివరించారు. బెట్టింగ్‌లో 100కోట్లు పోగొట్టుకున్నా... అతనిలో మార్పురాలేదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్​చౌహన్‌ వివరించారు. అశోక్‌రెడ్డితోపాటు... బెట్టింగ్‌ పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 20లక్షల నగదుతో పాటు వివిధ బ్యాంకుఖాతాల నుంచి కోటి 42లక్షలు గుర్తించినట్లు సీపీ చౌహన్‌ వెల్లడించారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న జగదీష్‌, జక్కిరెడ్డి అశోక్ రెడ్డి, వోడుపు చరాన్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని సీపీ తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్​కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు నిర్వహించే వారిని ఉపేక్షించబోమన్న పోలీసులు... అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

'అశోక్​రెడ్డి బెట్టింగ్‌లో పడి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో సంపాదించింది.. తెలిసిన వ్యక్తులు, బంధువుల నుంచి తీసుకున్న డబ్బంతా పెట్టాడు. 12 ఏళ్లుగా రూ.100 కోట్లు పోగొట్టుకున్నా.. ఆయనలో మార్పు రాలేదు. దాంతో మళ్లీ అదే పని చేస్తున్నాడు. ఓ సంస్థను ప్రారంభించి నష్టాలు రావడంతో ఐపీ పెట్టాడు. క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు. ఆన్​లైన్​లో బెట్టింగ్ పెట్టేవారిని ఉపేక్షించబోం.'-డీఎస్‌ చౌహాన్‌, రాచకొండ కమిషనర్‌

బెట్టింగ్​లో రూ.100 కోట్లు హాంఫట్.. అయినా..!​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.