హైదరాబాద్ నగర శివారు పహాడీ షరీఫ్ ఠాణా పరిధిలోని జల్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని ఓ చిన్న నీటి తొట్టెలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వస్తుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరిన పోలీసులు నీటి ట్యాంకును తొంలగించి చూడగా కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం కనిపించింది. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ నారాయణ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హత్యచేసి మృతదేహాన్ని నీళ్లట్యాంకులో పడేశారు - pahadi sharif
ఓ వ్యక్తిని హత్య చేసి నీటి ట్యాంక్‌లో దాచిన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో వెలుగు చూసింది.