ETV Bharat / state

కరోనాతో భర్త మృతి.. భార్యకు తెలిసి దిగ్భ్రాంతి

author img

By

Published : May 21, 2020, 3:01 PM IST

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త ఆచూకి తెలియడం లేదని ఓ మహిళ... మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​ ద్వారా విన్నవించుకుంది. వైద్యులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వాపోయింది. దీనిపై స్పందించిన ఆస్పత్రి వైద్యులు ఆ వ్యక్తి మే1న మృతిచెందాడని... జీహెచ్​ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని ఖననం చేసినట్లు తెలిపారు.

corona patient madhusudan died issue
కన్నీటి కథ: కరోనాతో భర్త మృతి.. భార్యకు తెలిసి దిగ్బ్రాంతి

కరోనా పాజిటివ్​తో గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త ఆచూకిలేదని వనస్థలిపురానికి చెందిన మాధవి.. ట్విట్టర్​ ద్వారా మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. తన భర్త మధుసూదన్​కి కరోన పాజిటివ్ రావడం వల్ల ఏప్రిల్​ నెలలో గాంధీ ఆస్పత్రిలో చేర్చామని... ఆ తరువాత కుటుంబం మొత్తానికి వైరస్​ సోకడం వల్ల తామంతా చికిత్స పొందినట్లు వివరించారు. ఇటీవల కుటుంబ సభ్యులు అందరూ కోలుకుని ఇంటికిరాగా... మధుసూదన్ మాత్రం రాలేదు. గాంధీ వైద్యులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయింది.

corona patient madhusudan died issue
కొవిడ్భ​తో మృతిచెందిన భర్త విషయం భార్యకు తెలియనివ్వలేదా..!

గాంధీ వైద్యులు ఏమంటున్నారంటే..

మహిళ ఫిర్యాదుపై స్పందించిన గాంధీ వైద్యులు మే 1న మధుసూదన్ మృతి చెందాడని... మృతదేహాన్ని అధికారిక నియమాల ప్రకారం... పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఘటనపై విచారణ జరపగా జీహెచ్​ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని ఖననం చేసినట్టు తేలిందన్నారు. దీనికి అస్పత్రిని, వైద్యులను బాధ్యులను చేయడం సరికాదని గాంధీ సూపరిండెంట్ రాజారావు పేర్కొన్నారు.

వివరణ ఇచ్చిన మంత్రి ఈటల

" వనస్థలిపురానికి చెందిన మధుసూదన్​ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోయారు. ఆయన కుమారుడు అదే రోజు ఆస్పత్రికి వచ్చాడు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పాం. ఈ విషయం కుటంబ సభ్యులకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారికి చెప్పలేదు. ఆ సమయంలో కుటుంబం అంతా ఆస్పత్రిలోనే ఉండటం వల్ల మేమే దహన సంస్కారాలు చేశాం." -ఈటల రాజేందర్​, మంత్రి

ఇదీ చూడండి: 'కరోనా లక్షణాలపై ఐసీఎంఆర్​ అధ్యయనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.