జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో... ఓ ద్విచక్రవాహనం ఢీ కొట్టి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకొని రాత్రి 8 గంటలకు... కూతురి ఇంటికి వెళ్లేందు బయలుదేరాడు. సీఎంఆర్ పాఠశాల దగ్గర రోడ్డు దాటుతుండగా... గుర్తుతెలియని ద్విచక్రవాహనం వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. తలకు బలమైన గాయమవడం వల్ల నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: హుజూర్నగర్ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం