వివాహం చేసుకుంటానని ఓ మహిళాను నమ్మించి, మోసం చేసిన వనస్థలిపురానికి చెందిన వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన బాధితురాలు అత్తాపూర్లో అసిస్టెంట్ డైరెక్టర్ కోర్సు చేస్తోంది. షాదీ డాట్ కాంలో సాయినాథ్ అనే యువకుడితో ఈమెకు పరిచయమైంది. సుమారు 20 రోజుల పాటు సహజీవనం చేసిన అనంతరం వివాహానికి నిరాకరించాడు. మనస్తాపానికి గురైన మహిళా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడి సాయినాథ్పై ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో జైలుకు తరలించారు.
ఇవీ చూడండి: 'చీరతో ఉరేసుకుని గృహిణి బలవన్మరణం'