ETV Bharat / state

Fake doctors: వార్డుబాయ్​లే వైద్యులు.. చావు అంచుల్లో రోగులు - తెలంగాణ వార్తలు

తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి నకిలీ వైద్యులు చెలామణి అవుతున్నారు. రాష్ట్ర రాజధానితో పాటు కొన్ని జిల్లాల్లో నకిలీ వైద్యుల తీరు రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఆపరేషన్ థియేటర్​లో అసిస్టెంట్​గా పనిచేసిన వ్యక్తి... శస్త్ర చికిత్స చేసేందుకు సాహసిస్తున్నాడు. ఫలితంగా ఎంతోమంది రోగులు తీవ్రమైన అనారోగ్యానికి గురై చావుకు దగ్గరైన సందర్భాలున్నాయి.

fake doctors, fake treatment
నకిలీ వైద్యులు, నకిలీ చికిత్స
author img

By

Published : Jul 5, 2021, 11:13 AM IST

హైదరాబాద్​తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నకిలీ వైద్యుల అవతారమెత్తుతున్న కొందరి కారణంగా రోగుల ప్రాణాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ ఆస్పత్రుల్లో నర్సింగ్‌ సిబ్బందిగానో, వార్డు బాయ్‌లుగానో పని చేసిన వారే ఈ అవతారం ఎత్తుతున్నారు. ఏకంగా శస్త్రచికిత్సలు చేయడానికి సాహసిస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది రోగులు తీవ్రమైన అనారోగ్యానికి గురై చావుకు దగ్గరైన సందర్భాలున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖకు చీమకుట్టినట్లుగా ఉండడంలేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • మహబూబ్‌నగర్‌ రాజేంద్రనగర్‌కు చెందిన పి.సాయికుమార్‌(35) ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఎంబీబీఎస్‌, ఎండీ పూర్తి చేసినట్లు చెప్పుకొని 2013లో మీర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డులో ‘సాయి క్లినిక్‌’ ప్రారంభించాడు. ఇతను కేవలం ఇంటర్‌ చదివాడు. ఇతను చేసిన వైద్యంతో ఇటీవల ఓ కొవిడ్‌ రోగి మృతి చెందాడు. విషయాన్ని పోలీసుల దృష్టికి రావడంతో అరెస్ట్‌ చేశారు.
వార్డు బాయ్​లే వైద్యులు
  • అయిదో తరగతితో చదువు ఆపేసిన వైఎస్‌ తేజ అలియాస్‌ వీరగంధం తేజ(23) ఏకంగా రాచకొండ పోలీస్‌ ఉన్నతాధికారులకే షాక్‌ ఇచ్చాడు. డాక్టర్‌నని చెప్పుకొని కొవిడ్‌ బారిన పడిన పోలీస్‌ సిబ్బందికి వైద్యం చేశాడు. పోలీసుల పేర్లతో సెటిల్‌మెంట్లు చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆరా తీయగా అసలు సంగతి బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని వర్సిటీ నుంచి నకిలీ ఎంబీబీఎస్‌ పట్టా పొందినట్లు గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
నకిలీ ధ్రువపత్రాలు
  • షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌ కొన్ని ఆస్పత్రుల్లో వార్డు బాయ్‌గా పని చేశాడు. శంషాబాద్‌కు చెందిన వైద్యుణ్ని పరిచయం చేసుకుని తానూ డాక్టర్నేనని నమ్మించాడు. ఆ వైద్యుడి ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తో షాద్‌నగర్‌లో ఆస్పత్రికి అనుమతి పొందాడు. గత ఏడాది అమ్మ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. కొద్ది రోజులకు అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ బాగోతం బయటపడింది. పరారైన ఆ నకిలీ వైద్యుణ్ని అరెస్టు చేయవద్దంటూ కీలకమైన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి తేవడంతో ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడం గమనార్హం.

సర్టిఫికెట్లు దిల్లీ నుంచే...

ఎంబీబీఎస్‌ నకిలీ సర్టిఫికెట్ల జారీలో దిల్లీకి చెందిన ఎస్‌ఎస్‌ కన్సల్టెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఒకటి, రెండ్రోజులు సమయమిస్తే చాలు.. ఏ సర్టిఫికెట్‌ కావాలంటే అది ఇచ్చేస్తున్నారని గుర్తించారు.

పేరులో ఒకటి.. లోపల మరొకరు

నిబంధనల ప్రకారం ఆసుపత్రి పెట్టాలంటే కనీసం ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. జిల్లాల్లో ఆస్పత్రులు పెట్టాలంటే ఎంబీబీఎస్‌ ధ్రువపత్రంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేస్తే అన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఇస్తుంది. అక్రమార్కులు నకిలీ ఎంబీబీఎస్‌ ధ్రువపత్రం సంపాదించి అధికారులను ఏమార్చి అనుమతి పొందుతున్నారు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి బోర్డు ఏర్పాటు చేసి రాజధాని పరిధిలోని ప్రముఖ వైద్యుల పేర్లు బోర్డు మీద రాయిస్తున్నారు. లోపలికి వెళ్తే ఆ వైద్యులు కన్పించడంలేదు. స్థానిక ప్రైవేటు ప్రాక్టీషనర్స్‌ దర్శనం ఇస్తున్నారు.

నిస్తేజంగా యంత్రాంగం

తమ పరిధిలోని ఆసుపత్రులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంది. వైద్యానికి సంబంధించిన అంశాలే కాకుండా, ఫీజులు ఇతరత్రా వ్యహారాలన్నింటినీ ఓ కంట కనిపెట్టాలి. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్లే ఆస్పత్రులను తరచూ తనిఖీలు చేయలేకపోతున్నామని కొన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే నకిలీ డాక్టర్లకు కలిసి వస్తోంది.

నకిలీ మకిలి

పాతబస్తీలో ఎక్కువ

పాతబస్తీలో పదుల సంఖ్యలో ఏర్పాటైన వైద్యశాలలపైనే అనేకమంది ప్రముఖ వైద్యుల పేర్లు కనిపిస్తున్నాయి. వాటిల్లో చికిత్సకయ్యే ఖర్చు తక్కువ కావడంతో వీరిదగ్గరికే రోగులు వెళ్తున్నారు. సరైన మందుల రాసి ఇవ్వకపోవడంతో అనేకమందికి రోగం ముదిరి పెద్ద ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇటీవల పాతబస్తీలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో పదికి పైగా నకిలీ వైద్యశాలలు వెలుగు చూశాయి.

ఇదీ చదవండి: MEDICAL COLLEGES: వైద్య కళాశాలలు తెరుచుకునేదెప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.