YCP Rally Against G O No 1: వైసీపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్ 1కి విరుద్ధంగా ఆ పార్టీ నాయకులే భారీ ర్యాలీ నిర్వహించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మహమ్మద్ మస్తాన్ నియమితులయ్యారు. మస్తాన్ ప్రమాణస్వీకారం సందర్భంగా నందిగామలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. అడుగడుగునా బాణాసంచా కాలుస్తూ ముందుకు సాగారు. వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో హంగామా చేశారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు నిలువరించకపోగా బందోబస్తు నిర్వహించడం గమనార్హం. భారీ ర్యాలీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: