Young man had a fight with the traffic police in Banjara Hills: ప్రస్తుత కొందరి యువకుల్లో సహనం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చాలా మంది మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఎక్కువగా తాగి వాహనాలు నడపడం వలన వారికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఎంతో ప్రమాదకరం. ఈ విషయం సినిమాల్లోనూ, పోలీసులు బహిరంగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు.. తదితర సందర్భాల్లో చెప్పుతుంటారు.
అయినా కొంత మంది వ్యక్తులు ఈ నిబంధనలను పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తుల కోసమే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో కొంత వరకు ప్రమాదాలను అరికట్టగలగుతున్నాం. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు కొందరు యువకులు మత్తులో చేయరాని తప్పులు చేస్తున్నారు. తమకు చాలా పవర్ ఉంది తమని ఏమని అనవద్దని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను కొడుతున్నారు. ఇలా చేయడంతో వారిపై పోలీసులు కేసులు పెట్టడంతో జైలు పాలవుతున్నారు. దీంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఓ యువకుడు తాగి కారు నడపుతుంటే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. టెస్ట్‌లో మద్యం తాగినట్టు తెలిసి అక్కడే ఆపి వేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు ఆ యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం సృష్టించాడు.
కారులో ప్రయాణిస్తున్న యువకుడిని బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో ఆ యువకుడికి 94bac పాయింట్లు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆ యువకుడు పోలీసులపై రెచ్చిపోయి దుర్భాషలాడాడు. ట్రాఫిక్ ఎస్ఐ మీద దుర్భాషలు ఆడుతూ.. తనకు హైకోర్టు జడ్జి తెలుసు..అంటూ బెదిరించాడు. ఆ యువకుడు ఎస్ఐని కాలితో తన్నాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు హైకోర్టులో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అతను ప్రయాణిస్తున్న కారులో ఒక మహిళ కూడా ఉంది.
ఇవీ చదవండి: