ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా పలుచోట్ల వృక్షాలు నేల కూలుతున్నాయి. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వద్ద వర్షం ధాటికి వృక్షం నేలకూలింది. యశోద ఆస్పత్రి సమీపంలోని పాన్ డబ్బాపై చెట్టు విరిగి పడింది. వెంటనే అప్రమత్తమైన పాన్ డబ్బా నిర్వాహకులు బయటకు పరుగులు తీశారు. ఫలితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
పూర్థిగా ధ్వంసం...
భారీ వృక్షం పడటంతో పాన్ డబ్బా పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వృక్షాన్ని తొలగించారు.
ఇవీ చూడండి : 'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'