ETV Bharat / state

ఆటో డ్రైవర్​పై.. తెగి పడిన విద్యుత్ వైరు - సికింద్రాబాద్​ తాజా వార్తలు

ఓ ఆటో డ్రైవర్​కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఆటో డ్రైవర్ నర్సారెడ్డిపై విద్యుత్ వైరు తెగి పడింది. ఈ ఘటన వెస్ట్ మారేడుపల్లిలో జరిగింది.

A broken electrical wire on an auto driver at west marredpally
ఆటో డ్రైవర్​పై.. తెగి పడిన విద్యుత్ వైరు
author img

By

Published : Mar 2, 2020, 11:50 PM IST

హైదరాబాద్​ వెస్ట్ మారేడుపల్లిలోని సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఆటో డ్రైవర్ నర్సారెడ్డిపై విద్యుత్ వైరు తెగి పడింది. ఈ ప్రమాదంలో నర్సారెడ్డి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. పాఠశాలలో పిల్లలను ఎక్కించుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతనిపైనుంచి తీగను లాగేశారు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా అతన్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సారెడ్డి నాగూర్ వాసీగా పోలీసులు గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆటో డ్రైవర్​పై.. తెగి పడిన విద్యుత్ వైరు

ఇదీ చూడండి : 'రెండు పడకల గదుల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.