ETV Bharat / state

అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. అనుకోని ఘటనతో గాయాలపాలు - హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి తాజా వార్తలు

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. అనారోగ్యంతో చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగికి.. వింత పరిస్థితి ఎదురైంది. మంచంపై పడుకోబెట్టి చికిత్స చేస్తుండగా.. ఆ మంచం విరిగిపోయిన ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ రోగికి తీవ్రగాయాలవడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

Hindupuram Government Hospital
Hindupuram Government Hospital
author img

By

Published : Nov 20, 2022, 5:21 PM IST

అసలే అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే... అక్కడి మంచం విరిగి రోగి నడుము విరగ్గొట్టుకున్న ఘటన.. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన అల్తాఫ్‌ అనే బాలుడికి జ్వరం రావడంతో తల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత చిన్నపిల్లల వార్డులో మంచం కేటాయించి చికిత్స అందిస్తున్నారు.

బాలుడు, అతడి తల్లి ఆ మంచంపై ఉండగా.. ఒక్కసారిగా అది విరిగి ఒక పక్కకు పడిపోయింది. దీంతో జ్వరంతో బాధపడుతున్న కుమారుడితో పాటు.. అతడి తల్లికి గాయాలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధితులు వాపోయారు.

అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. అనుకోని ఘటనతో గాయాలపాలు

ఇవీ చదవండి: డిసెంబర్ 4న మహబూబ్​నగర్​కు ముఖ్యమంత్రి కేసీఆర్

తండ్రిని పోలీసులు కొట్టారని కోపం.. న్యాయం కోసం జడ్జిగా మారిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.