తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో పుంగనూరు రకానికి చెందిన ఆవుకు 15 అంగుళాల ఎత్తున్న అరుదైన పుంగనూరు కపిల ఆవు దూడ జన్మించింది. రెడ్డి సత్తిబాబు అనే రైతుకు చెందిన ఈ ఆవు దూడ... ఇంత తక్కువ ఎత్తులో పుట్టడంతో చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా పుంగనూరు ఆవు దూడ 18 అంగుళాల నుంచి 22 అంగుళాల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం పుట్టిన దూడ 15 అంగుళాల ఎత్తు, 30 అంగుళాల పొడవు, 6 కేజీల బరువు ఉందని సత్తిబాబు తెలిపారు. కపిల ఆవుకు పుంగనూరు జాతికి చెందిన వీర్యంతో సంపర్కం చేయడంవల్ల పుంగనూరు లక్షణాలతో కపిల ఆవు దూడ పుట్టిందని వైద్యశాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి