జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల్లో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం తెరాస-527, భాజపా-539, కాంగ్రెస్-348, తెదేపా-202, ఎంఐఎం-72, సీపీఐ-22, సీపీఎం-19, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు-143, స్వతంత్రుల నుంచి 613 నామినేషన్లు దాఖలయ్యాయి.
కుత్బుల్లాపూర్ 125వ డివిజన్ గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు గాజులరామారం సర్కిల్ కార్యాలయానికి తరలిరావడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ముగ్గురు సంతానం ఉన్నారని నామినేషన్ తిరస్కరించినట్లు ఆర్వో సుజాత ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఇదీ చదవండి: బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత