ETV Bharat / state

ఒక్కరోజులో 888 కేసులు.. వణుకుతున్న హైదరాబాదీలు - హైదరాబాద్ కరోనా వార్తలు

భాగ్యనగరాన్ని కరోనా వణికిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో 888 కేసులు నమోదు కావడం వల్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీల్లో కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వైద్య సిబ్బందితో పాటు అధికారులను మహమ్మారి వదలడం లేదు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

CORONA
CORONA
author img

By

Published : Jun 28, 2020, 7:13 AM IST

గుట్టుగా కుటుంబంలో ఒకరికి సోకుతున్న కరోనా మిగతా అందరికీ వ్యాపించి హడలెత్తిస్తోంది. దీంతో ఆ కుటుంబంలోని వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరొకరికి వ్యాప్తి చెందుతోంది. ఒక్కో కుటుంబంలో ఆరేడు మంది వైరస్‌ బారిన పడి విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పరిశుభ్రత ముఖ్యం

బయట నుంచి ఇంట్లోకి వెళ్లేప్పుడు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, అవకాశం ఉంటే స్నానం చేసి వెళ్లాలని చెబుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే... మిగతా సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, తగ్గని జ్వరం, దగ్గు లాంటివి ఉంటే పరీక్షలు చేసుకొవాలి. శనివారం గ్రేటర్‌ వ్యాప్తంగా 888 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు గ్రేటర్‌ పరిధిలో ఇదే గరిష్ఠం. రంగారెడ్డి జిల్లాలో 74 మంది, మేడ్చల్‌ జిల్లాలో 37 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

వేగంగా ఒకరి నుంచి ఒకరికి...

కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ఒకరికి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. హిమాయత్‌నగర్‌, నారాయణగూడలో వరుస కేసులు నమోదవుతున్నాయి. శనివారం దాదాపు పది మంది ఆరోగ్య మిత్రలు వైరస్‌ బారిన పడ్డారు. వీరంతా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తుండటంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. వారితో కలిసిన సిబ్బంది అందర్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

మరో కార్పొరేటర్‌కు

మూసాపేట, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేటలోని పలు బస్తీల్లో 25 కేసులు బయటపడ్డాయి. తాజాగా నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ కార్పొరేటర్‌కు కొవిడ్‌ నిర్ధరణ అయింది. ఇప్పటికే నగరంలో ఓ కార్పొరేటర్‌ కరోనా బారిన పడ్డారు. తొలి కరోనా కేసు నమోదైన మహేంద్రహిల్స్‌లో అడపాదడపా మళ్లీ కేసులు బయట పడుతున్నాయి. ఆ ప్రాంతంలో మరో ఇద్దరికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.

అంబర్‌పేటలో విజృంభణ

న్యూబోయిగూడలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 8 మంది మహమ్మారి బారిన పడ్డారు. యూసుఫ్‌గూడలోని సర్కిల్‌-19లో పది మందికి, అంబర్‌పేట సర్కిల్‌ పరిధిలో ఒకే రోజు 26 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. బాధితుల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు మొదలుకొని ఆరుగురు వరకు ఉంటున్నారు. లక్షణాలు లేని వారిని హోం క్వారంటైన్‌, తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

కలెక్టరేట్‌లో కరోనా

కరోనా రెవెన్యూ ఉద్యోగులనూ వణికిస్తోంది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకింది. వారితో ఉన్న సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. కొందరు ఉద్యోగులను విధులకు రావాలని చెప్పడంతో వణికిపోతున్నారు. కార్యాలయంలో తొలుత ఓ ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడికి కొవిడ్‌-19 సోకింది. కొద్దిరోజులకే అక్కడే మరో ఉద్యోగిలో లక్షణాలు కనిపించటంతో సెలవుపై వెళ్లాడు. తరువాత అతన్ని పాజిటివ్‌గా నిర్ధరించారు. తాజాగా ఓ తహసీల్దార్‌ మహమ్మారి బారిన పడ్డారు. ఇటీవల కరోనా సోకిన ఓ కార్పొరేటర్‌ ఈ తహసీల్దార్‌ కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో ఓ ఆర్‌ఐలోనూ కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.