దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ బలగాల పాత్ర కీలకమని సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా (CRPF IG Mahesh Chandra Ladda) వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్ దక్షిణాది సెక్టార్ కార్యాలయంలో 83వ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఐజీ నివాళులు అర్పించి... వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ భద్రతకు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు. భారత్‌లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగం అయినా సీఆర్పీఎఫ్ 1939లో స్థాపించబడిందని... ఒక బెటాలియన్‌తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించిందని తెలిపారు.
83 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో సీఆర్పీఎఫ్ ప్రారంభమైంది. 1939లో ఒక బెటాలియన్‌తో ప్రారంభమై... ప్రస్తుతం 246 బెటాలియన్లకు విస్తరించింది. భారత్‌లోనే అతిపెద్ద పారా మిలటరీ బలగంగా మారి... అంతర్గత భద్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దేశంలో 3 లక్షలకు పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు.
-సీఆర్ఫీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్డా
సాధారణ శాంత్రి భద్రతలు, నక్సలిజం, ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు సీఆర్పీఎఫ్ పనిచేస్తోందని ఐజీ తెలిపారు. దేశంలో పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ... దళానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం జరిగినా... హరిత క్రాంతి పేరుతో మొక్కలు నాటుతున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌లో వాల్యుర్ డే వేడుకలు