ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 5,783 మంది శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 1, 259కి చేరగా.. వైరస్ బారిన పడి 31 మంది మృతి చెందారు. కొవిడ్- 19 నుంచి కోలుకుని 258 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 970 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన వాటిలో అత్యధికంగా 40 కేసులు ఒక్క కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు