ETV Bharat / state

800 మంది పోలీసులకు కరోనా.. కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఎక్కువ

కరోనాపై పోరులో ముందుండి నడిచారు. లాక్​డౌన్​ విజయవంతంలో కీలకపాత్ర పోషించారు. ఐతే ఇప్పుడు వారినే కొవిడ్​ ముప్పు వెంటాడుతోంది. ఒక్కొక్కరికీ వైరస్​ సోకుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 800 మంది పోలీసులు ఈ మహమ్మారి బారినపడగా.. వీరిలో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఎక్కువ మంది ఉన్నారు.

800 corona positive cases in police department
800 మంది పోలీసులకు కరోనా.. కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఎక్కువ
author img

By

Published : Jul 7, 2020, 9:47 AM IST

కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలబడుతున్న పోలీసులే ఆ వ్యాధికి ఎక్కువగా గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దాదాపు 800 మందికి వైరస్‌ సోకింది. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 761 మంది పోలీసులు కొవిడ్‌కు గురయ్యారు. కోలుకున్న వారు తిరిగి విధులకు హాజరవుతుండగా.. మరికొందరు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఎక్కువమంది క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండడం గమనార్హం. మరే ప్రభుత్వ విభాగంలోనూ ఇంతమంది కరోనా పీడితులు లేరంటేనే పోలీసు శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆరుగురు పోలీసులు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఒకటీ అరా మినహా మిగతావన్నీ రాజధానిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందినవే. బాధితుల్లో నలుగురు ఐపీఎస్‌ అధికారులు ఉండగా వారంతా కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు.

పాతబస్తీలోనే అత్యధికం..

  • హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాధితుల్లో 288 మంది దక్షిణ మండలానికి చెందిన వారే.
  • మొత్తం బాధితుల్లో 479 మంది కానిస్టేబుళ్లు, 124 మంది హోంగార్డులు, 51 మంది హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది ఉన్నారు.
  • 613 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కాగా 83 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
  • 126 మంది కోలుకుని బయటపడగా 59 మంది విధులకు హాజరవుతున్నారు.
  • మొత్తం బాధితుల్లో 264 మంది ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తేలింది.

వ్యాధి తరుముతున్నా తప్పని విధులు..

ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా పోలీసులు విధులు నిర్వర్తించాల్సిందే. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ తమ సిబ్బంది అధైర్య పడటం లేదని ఒక ఉన్నతాధికారి అన్నారు. అయితే నిత్యం ప్రజల్లో ఉండాల్సి రావడం, కేసు నమోదు నుంచి దర్యాప్తు, నిందితుల అరెస్టు వరకూ అన్నింటిలోనూ ప్రజలతో సన్నిహితంగా మెలగాల్సి రావడం వల్ల పోలీసు సిబ్బంది ఎక్కువగా కరోనాకు గురవుతున్నారు. వీటికి కరోనా విధులు అదనం. ఎక్కడైనా పాజిటివ్‌ కేసు రాగానే అవసరమైతే ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహించాల్సి వస్తోంది. వీటన్నింటి వల్లనే పోలీసులు అధిక సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతున్నారు. దీంతో సిబ్బంది రక్షణ కోసం అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడంపై కిందిస్థాయి సిబ్బందిలో అవగాహన పెంచుతున్నారు. పోలీస్‌స్టేషన్లోకి అవసరమైతే తప్ప ఇతరులను అనుమతించడంలేదు.

ఇదీచూడండి: సర్వే జాబితా తారుమారు.. ఔషధ నగరి భూముల్లో కాసుల వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.