ETV Bharat / state

77th Independence Day Celebrations in Hyderabad : హైదరాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

77th Independence Day Celebrations in Hyderabad : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలతో నూతన శోభ సంతరించుకుంది. మారుమూల పల్లె బడి పిల్లల నుంచి ప్రగతిభవన్ పెద్దల వరకు అడుగడుగున జెండా వందనం చేస్తూ.. తమ తమ దేశభక్తిని చాటుకుంటూ స్వాతంత్య్ర వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.

77th Independence day Celebrations
TS Independence Day Celebrations
author img

By

Published : Aug 15, 2023, 12:11 PM IST

Updated : Aug 15, 2023, 8:36 PM IST

Independence Day 2023 హైదరాబాద్​లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

77th Independence Day Celebrations in Hyderabad : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర అధికార పార్టీ బీఆర్​ఎస్​ మంత్రులు, రాజకీయ నేతలు, పలు ప్రముఖులు జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అసెంబ్లీ, శాసన మండలిలో స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముందుగా ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్​.. అనంతరం.. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైనంలోని అమరజవాన్ల స్థూపం వద్ద నివాళుర్పించారు.

CM KCR Flag Hoisting: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర సైనికులకు.. ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అమరజవాన్ల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్​కు చేరుకున్న ముఖ్యమంత్రికి.. పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. అసెంబ్లీలో జాతిపిత గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ పరిపాలన దేశానికే దిక్సూచి..: అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో సమరయోధుల త్యాగ ఫలాల వల్లే స్వాతంత్రం సిద్ధించిందని స్పీకర్ తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రావాలని ఆకాంక్షించారు కాబట్టే తెలంగాణ ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ పరిపాలన దేశానికే దిక్సూచిగా నిలించిందన్నారు. పంట పండించే విస్తీర్ణం, జీఎస్టీ, రైతన్నలకు అందిస్తున్న రుణమాఫీ, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు(Large Scale Welfare Programs in Telangana) అమలవుతున్నాయన్నారు. జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురేశారు. దేశ ప్రజలకు కూడా ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు అందాలని కోరుకున్నారు. దేశ ప్రజల సౌభాగ్యం కోసం రాజకీయ పార్టీల నేతలు పని చేయాలని.. పరస్పర విమర్శలు మానుకొని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ..: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల్లో భాగంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. బోయిన్​పల్లిలోని తన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలో సరైన అభివృద్ధి జరగలేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దశాబ్ది కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలిపారని కొనియాడారు. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేలా దేశ నాయకత్వం పని చేయాలని.. తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగురవేశారు. ఎంతోమంది అమరుల త్యాగఫలం మూలంగా స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి గుర్తు చేశారు.

గోల్కొండపై 2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సైతం కేసీఆరే..: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(77th Independence day Celebrations ) నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మువ్వన్నెల జెండాను ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ సంపదను కొల్లగొట్టిన బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొంది 76 సంవత్సరాలు గడిచిందని మంత్రి స్మరించుకున్నారు. ఈ తరుణంలో భారత్ ఎంతగానో అభివృద్ధిపరంగా పురోగించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో, సంక్షేమ పథకాల ద్వారా ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. గోల్కొండపై వచ్చే సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సైతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

BJP State President Kishan Reddy Flag Hoisting : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో.. భాజపా నేతలు, పార్టీ శ్రేణులు సహా పలువురు పాల్గొన్నారు. దేశ రక్షణలో అమరులైన వీరా రాజారెడ్డి తల్లిదండ్రులను కిషన్ రెడ్డి సన్మానించారు.

KA Pal Salute the Flag : హైదరాబాద్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర వచ్చి 77ఏళ్లు అవుతున్నా.. దేశంలో శాంతి కరవైందన్నారు. నాయకులు రాజకీయ లబ్ది కోసం పాకులాడకుండా.. స్వాతంత్య్ర సమరయో‍ధుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని పాల్‌ కోరారు.

Independence Day celebrations in Ramoji Film City : 77వ స్వాతంత్య్ర వేడుకలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా జరిగాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి యూకేఎమ్​ఎల్​ డైరెక్టర్‌ శివరామకృష్ణ, రామోజీ గ్రూపు సంస్థల మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్‌ అట్లూరి గోపాలరావు హాజరయ్యారు. రామోజీ గ్రూపులోని వివిధ విభాగాల అధిపతులు, ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మేనేజింగ్​ డైరెక్టర్​ విజయేశ్వరి జాతీయ పతాక అవిష్కృతం అనంతరం సిబ్బందిని కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రసంగించారు. హైదరాబాద్​ నగరమంతా రాజకీయ నేతలు వారి నియోజక వర్గాల్లో జెండా ఎగురవేసి దేశ భక్తిని చాటారు. ప్రజలకు దేశ చరిత్ర గురించి తెలియజేశారు.

77th independence day 2023 : ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ.. వరుసగా పదోసారి..

77th Independence Day Celebrations At Golconda Fort : గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్న సీఎం.. కేసీఆర్ స్పీచ్​పై సర్వత్రా ఆసక్తి

Last Updated : Aug 15, 2023, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.