ETV Bharat / state

77th Independence Day Celebrations At Golconda Fort : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం - తెలంగాణ డీజీపీ వార్తలు

77th Independence Day Celebrations At Golconda Fort : స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు శాఖల అధికారులు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు విద్యుత్‌ దీపాల అలంకరణలతో దగదగలాడుతున్నాయి. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.

DGP Review on Independence Day Celebrations
Independence Day Celebrations Telangana 2023
author img

By

Published : Aug 12, 2023, 11:52 AM IST

77th Independence Day Celebrations At Golconda Fort : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం

77th Independence Day Celebrations At Golconda Fort : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. తాజాగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్(Telangana State DGP Anjani Kumar) వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. బందోబస్తుకు సంబంధించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

DGP Review on Independence Day Celebrations in Telangana : ఆగస్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం.. 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేెెెందుకు దాదాపు 1,200 మంది కళాకారులను సంసిద్ధం చేసినట్లు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి సమీక్షించారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యే వారు సభా ప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా.. కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు.

Independence Day 2023 Golconda Fort : గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations Telangana 2023 : సభకు వచ్చిన ముఖ్య అతిథులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డీజీపీకి వివరించారు.హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఒక లక్ష వాటర్ ప్యాకెట్​లు, 25 వేల వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు(Medical Services in Emergency Situations) అందించేందుకు సభా ప్రాంగణంలో 4 అంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్​లో ఒక గదిని సిద్ధంగా ఉంచామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 3 ఫైర్ ఇంజిన్లు, 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Telangana Secretariat Lights Show : గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1930 వాహనాల నిలుపుదలకు సరిపడా స్థలాన్ని ఏర్పాటు చేశామని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలో శానిటేషన్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సచివాలయం వెలిగిపోతోంది. భవనానికి రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చారు. దీంతో సచివాలయం దగదగలాడుతోంది. వివిధ వర్ణాల కాంతులతో భవనం మెరిసిపోతూ.. చూపరులను ఆకట్టుకుంటోంది.

వావ్​.. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్​ సెల్ఫీలు చూశారా?.. అంతా AI మహిమ గురూ!

How Nizam rule ended: తిరగబడ్డ తెలంగాణ...విమానం వెనక రజ్వీ పరుగు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.