హైదరాబాద్‌లోని హయత్ నగర్, ఎల్.బీ.నగర్, మియాపూర్, కోకాపేట్, పటాన్చెరు ప్రాంతాల్లో రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అధిక బరువుతో ప్రయాణిస్తున్న 75 లారీలను సీజ్ చేశారు. రూ.10 లక్షలకు పైగా జరిమానా విధించినట్లు రవాణాశాఖ అధికారి పాపారావు తెలిపారు. మెుత్తం 5 బృందాలుగా ఏర్పడి వివిధ విభాగాల సహాయంతో తనిఖీల చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండ: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం-వైరాలజీ విభాగం దగ్ధం