ETV Bharat / state

పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ - తెరాస ప్రభుత్వంపై మండిపడిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

హైదరాబాద్​లో అక్రమంగా నివసిస్తున్నవారు ఓటుహక్కు పొందుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్​ అభివృద్ధి కోసం భాజపాకు మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

smriti irani on ghmc elections
పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ
author img

By

Published : Nov 25, 2020, 12:43 PM IST

Updated : Nov 25, 2020, 1:10 PM IST

పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 75 వేల మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారన్న కేంద్ర మంత్రి.. దీనిపై తెరాస, మజ్లిస్‌లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌, రోహింగ్యా ముస్లింలను రాజకీయ లబ్దికోసం కాపాడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే..

పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించినట్లు చెబుతున్నారని.. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

నివేదిక రాలేదు..

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై సమగ్ర నివేదిక కేంద్రానికి పంపలేదని స్మృతి ఇరానీ తెలిపారు. తెలంగాణ ఒక్క కుటుంబం కోసం కాదని... ఎందరో త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కును మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఆయుస్మాన్ భారత్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే కరోనా సోకిన పేదలకు లబ్ధి చేకూరేదన్నారు.

ఇవీచూడండి: భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం... రేపే విడుదల

Last Updated : Nov 25, 2020, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.