ETV Bharat / state

5PM TOPNEWS: టాప్​న్యూస్ @ 5PM

ఇప్పటివరకు తాజా వార్తలు

author img

By

Published : Mar 23, 2022, 4:59 PM IST

5PM TOPNEWS
5PM TOPNEWS
  • రాష్ట్రంలో పెరిగిన విద్యుత్​ ఛార్జీలు...

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం షాకిచ్చింది. గృహాలకు యూనిట్​కు 50 పైసలు, పరిశ్రమలకు రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ఈఆర్సీ ప్రకటించింది.

  • పాదయాత్రలో వైఎస్ షర్మిలపై తేనెటీగల దాడి..

వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి జరిగింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమెపై తేనెటీగలు దాడి చేయడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం దుర్సగనిపల్లిలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు వారిపైకి దూసుకొచ్చాయి.

  • ఆ నోటీసు ప్రివిలేజ్‌ కిందకు రాదు

ప్రధానిపై తెరాస ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన తీర్మానంపై రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం స్పందించింది. తెరాస ఎంపీలు ఇచ్చిన నోటీసు ప్రివిలేజ్ కిందకు రాదని తేల్చి చెప్పింది.

  • దూసుకొచ్చిన మృత్యువు..

ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ ఆరాంఘర్​లో రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఆర్టీసీ బస్ ఢీకొనగా ఓ చిన్నారి మృతి చెందింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్​గా మారాయి.

  • 'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి'

రాష్ట్రంలో 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు కంకణం కట్టుకుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. అమెరికా ప‌ర్యట‌న‌లో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

  • కశ్మీరీ​ పండిట్ల ఊచకోతకు ఈ గ్రామమే మౌన సాక్షి..

'ద కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రంతో కశ్మీరీ పండిట్ల ఊచకోత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాంటి ఘటన జరిగిన కశ్మీర్‌లోని ఓ గ్రామాన్ని ఈటీవీ భారత్‌ సందర్శించింది. 2 దశాబ్దాల క్రితం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 24 మంది కశ్మీరీ పండిట్లను ఒకే గ్రామంలో అత్యంత కిరాకతంగా చంపారు.

  • ఇక మాస్కులు అవసరం లేదా?

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి గత రెండేళ్లుగా ఆంక్షల చట్రంలో నలిగిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది.

ప్రేక్షకులకు అనుమతి.. కానీ!

ఐపీఎల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను మైదానాలకు స్వాగతం పలుకుతున్నామని బీసీసీఐ తెలిపింది. ఈ నెల 26న ప్రారంభమయ్యే ఐపీఎల్​ 15వ సీజన్​కు 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

  • ఆరంభ లాభాలు ఆవిరి..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు మళ్లీ నష్టాలు నమోదుచేశాయి. తీవ్ర ఒడుదొడుకుల సెషన్​లో సెన్సెక్స్​ 300, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయాయి.

  • ఆస్ట్రేలియాలో తారక్​ క్రేజ్​..​

మరి రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందానికి వినూత్న రూపంలో విషెస్​ తెలిపారు ఆస్ట్రేలియాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్​. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్​ఆర్​ఆర్', 'జై ఎన్టీఆర్'​​ ఆకృతిలో వాటిని అమర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.