తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,11,226 నమూనాలను పరీక్షించగా.. 577 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,48,388కి చేరింది. తాజాగా మహమ్మారికి ఇద్దరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 3,819కి పెరిగింది. వైరస్ బారి నుంచి మరో 645 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,674 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా వచ్చిన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 79, ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 20, జగిత్యాల 19, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 4, జోగులాంబ గద్వాల జిల్లా 1, కామారెడ్డి 1, కరీంనగర్ 66, ఖమ్మం 42, కుమురం భీం ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 12, మంచిర్యాల 15, మెదక్ 4, మేడ్చల్- మల్కాజిగిరి 30, ములుగు 8, నాగర్‌కర్నూల్ 3, నల్గొండ 36, నారాయణపేట 2, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 34, రాజన్న సిరిసిల్ల 14, రంగారెడ్డి 25, సంగారెడ్డి 7, సిద్దిపేట 19, సూర్యాపేట 21, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 38, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: DENGUE FEVER: డెంగీ డేంజర్ బెల్స్.. ఏజెన్సీ గ్రామాల్లో పంజా