ఏపీలో కొత్తగా 5,741 కరోనా కేసులు నమోదయ్యాయి. 96,153 శాంపిల్స్ పరీక్షించగా.. ఈమేరకు కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 830 మందికి వైరస్ సోకింది.
వైరస్ కాటుకు మరో 53 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 12 మంది చనిపోగా, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి మరో 10,567 మంది కోలుకోగా.. ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ఇదీ చదవండి: KTR:సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..