ETV Bharat / state

డేంజర్ బెల్స్​:  గ్రేటర్‌లో కరోనా నలువైపులా విరుచుకుపడుతోంది!

author img

By

Published : Jul 20, 2020, 6:39 AM IST

హైదరాబాద్‌ ప్రధాన నగరంతోపాటు శివార్లలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం గ్రేటర్‌లో 557 కేసులు నమోదయ్యాయి. జలుబు, ఇతర సమస్యలు పెరిగిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పరీక్షల కోసం ఆసుపత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. కింగ్‌ కోఠి, ఫీవర్‌ ఆసుపత్రుల వద్దకు వచ్చేవారిని అదుపు చేయలేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

coronavirus
coronavirus

రాష్ట్ర రాజధానిలో నిత్యం 700-800 మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. పౌరులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, మాస్కు లేకుండా గుంపుల్లో తిరిగినా వైరస్‌ విజృంభించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం గ్రేటర్‌లో 557 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చల్‌లో 87 మందికి కరోనా సోకింది. అంబర్‌పేట సర్కిల్‌లో 60 కేసులు నమోదయ్యాయి.

బాధితుల్లో బస్తీవాసులు ఎక్కువగా ఉన్నారు. ఉప్పల్‌ పరిధిలో 18 మంది, కాప్రా సర్కిల్‌లో ఆరుగురు కరోనా బారినపడ్డారు. మల్కాజిగిరి సర్కిల్‌లో ఆదివారం పరీక్షలు నిర్వహించలేదు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో 41 మందికి వైరస్‌ సోకింది. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, సంతోష్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోనూ బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నారు.

ఊరెళ్లిపోయామంటూ...

నగరంలో పరీక్షలు చేయించుకున్న కొంతమంది ఫలితాలు రాకముందే ఊరెళ్లిపోవడం వంటివి తమ దృష్టికి వచ్చాయని బల్దియా చెబుతోంది. ఫోన్‌ నంబర్లను సంప్రదిస్తే చాలామంది నుంచి ఈ జవాబు వచ్చిందన్నారు. గుర్తించలేని 2వేల కేసుల్లో ఆ కోవకు చెందినవారు 20శాతం ఉంటారని అంచనా. ఎక్కువ శాతం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు జాబితాలో ఉన్నారు.

ఆయాసమొస్తుందన్నా పట్టించుకోలేదు!

కరోనా పాజిటివ్‌ వచ్చి ఆరు రోజులైనా, తనకు ఆయాసమొస్తోందని చెప్పినా స్థానిక అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు మల్లాపూర్‌ డివిజన్‌ అశోక్‌నగర్‌కు చెందిన ఓ బాధితుడు(51). మల్కాజిగిరి పరీక్షకేంద్రంలో ఈనెల 14న కరోనా పరీక్షలు చేయించుకోగా అదేరోజు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

యూపీహెచ్‌సీ వైద్యసిబ్బంది, కాప్రా సర్కిల్‌ అధికారులు కనీసం ఐసోలేషన్‌ కిట్‌ కూడా తనకు ఇవ్వలేదని తెలిపారు. గత రెండురోజులుగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో ప్రభుత్వ కంట్రోల్‌ రూం నంబర్‌కు సమాచారమిచ్చినా ఫలితం లేదని వాపోయారాయన.

గ్రేటర్‌లో ఇప్పటివరకు

  • మొత్తం కరోనా బాధితులు.. 31,000
  • మహిళలు 10,900
  • పురుషులు 20,100

ఇదీ చదవండి: రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.