హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రాథమిక పరీక్షలు చేసే విధంగా వాటిని మార్చనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 123 దవాఖానాలుండగా.. 500 వరకు వాటి సంఖ్యను పెంచేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం మంత్రి కేటీఆర్, ఇతర మంత్రుల చేత రాష్ట్రంలో 45 దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలో 40, 900 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. మిగతా 41,000 ఇళ్లను జులై నాటికి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లో 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. నగరవ్యాప్తంగా 97 వేల మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను జులై ఆఖరు నాటికి పూర్తిచేస్తాం. వాటి కోసం ఎవరూ డబ్బులివ్వకండి. పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
- బొంతు రామ్మోహన్, నగర మేయర్
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు