ETV Bharat / state

50 లక్షల హవాలా నగదు పట్టుబడింది - Hyderabad police seized Rs 50 lakh hawala money

ఎల్బీ స్టేడియం సమీపంలో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్నరూ. 50 లక్షలు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఆ నగదును సైఫాబాద్​ పోలీసులకు అప్పగించారు.

50 lakh hawala cash seized in hyderabad
50 లక్షల హవాలా నగదు పట్టుబడింది
author img

By

Published : Oct 28, 2020, 10:48 PM IST

హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న రూ.50 లక్షలు ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటకు చెందిన అవినాశ్ వృత్తిరిత్యా స్థిరాస్తి వ్యాపారి. హైదరాబాద్​తోపాటు తమిళనాడులోని కోయంబత్తూర్​లో వ్యాపారం చేస్తున్నాడు.

పెట్టుబడుల కోసం శ్రీకాళహస్తిలోని తన స్నేహితుడి నుంచి హవాలా మార్గం ద్వారా 50 లక్షలు మోజంజాహి మార్కెట్ వద్ద తీసుకున్నాడు. నగదును కారులో ఉంచుకుని వెళ్తుండగా... తమకు వచ్చిన సమాచారం మేరకు ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు ఎల్బీ స్టేడియం సమీపంలో తనిఖీలు చేసి అవినాశ్​ను ఆపారు. కారులో ఉన్న నగదుకు సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల డబ్బును స్వాధీనం చేసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి : దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.