ETV Bharat / state

కేపీహెచ్​బీలోని ఓ హోటల్​లో 50 మంది కరోనా అనుమానితులు! - 50 corona suspects in OYO rooms at KPHB Colony

హైదరాబాద్​లో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ పలువురు నగరవాసులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాంటిది కరోనా‌ అనుమానితులకు కేపీహెచ్​బీలో హోటల్ రూములు కేటాయించటంతో స్థానికులు ఆందోళనకు దిగారు.

50 corona suspects in OYO rooms at KPHB Colony in Hyderabad
ఓయో రూమ్స్​లో 50 మంది కరోనా అనుమానితులు..!
author img

By

Published : Jul 14, 2020, 10:01 PM IST

మేడ్చల్​ జిల్లా కేపీహెచ్​బీలో కరోనా‌ అనుమానితులకు హోటల్ రూమ్​లు కేటాయించడం వల్ల స్థానికులు ఆందోళనకు దిగారు. సర్దార్ పటేల్ నగర్​లో గల ఓయో రూమ్స్​లో సుమారు యాభై మంది కరోనా అనుమానితులకు రూములు కేటాయించినట్లు ఆరోపించారు. పోలీసులు, స్థానిక కార్పొరేటర్​ సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ యాజమాన్యంతో చర్చలు నిర్వహించారు.

హోటల్ రూంలో ఉన్నవారిని మరోచోటికి తరలించేందుకు హోటల్ యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. హోటల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రూమ్​లో ఉన్న వారు బయటకు రాకుండా అలాగే కొత్తవారు లోనికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.