ETV Bharat / state

ముషీరాబాద్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 42 కేసులు - హైదరాబాద్​ కరోనా వార్తలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 42 మందికి కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 671 కేసులు నమోదయ్యాయి.

mushirabad corona cases
ముషీరాబాద్​పై కరోనా పంజా... ఒక్కరోజే 42 కేసులు
author img

By

Published : Jul 10, 2020, 8:08 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 42 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 671 కేసులు వచ్చాయి. రోజురోజుకు మహమ్మారి విజృంభణతో స్థానికంగా కలవరం నెలకొంది. ముఖ్యంగా తలనొప్పి, జ్వరం, జలుబు ఏ ఒక్కరిలో కనిపించినా ఆ కుటుంబం, స్థానికులు గజగజ వణుకుతున్నారు.

నియోజకవర్గంలోని భోలక్​పూర్​, కవాడిగూడ, గాంధీ నగర్, అడిక్మెట్, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్​లలోని కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో వేర్వేరు గదులు లేని కుటుంబాల దుస్థితి దయనీయంగా ఉంది. కేసులు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కంటైన్మెంట్ జోన్లు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు ప్రాంతాలను కంటైన్మెంట్​ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పడు రసాయనాలు పిచికారి చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.