ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు. నిండుగర్భిణీగా ఉన్న జషిత్ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి : కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి