హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు 16 కార్లు, 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో సోమవారం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. మంగళవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చూడండి:డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్