హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 9 నుంచి మూడు కారిడార్లలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన ప్రయాణికులు మాత్రం తక్కువగానే వస్తున్నారు. బుధవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 680 మెట్రో రైళ్ల ట్రిప్పులు తిప్పినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీంట్లో బుధవారం 31 వేల మంది మెట్రోలో ప్రయాణించారని వెల్లడించారు.
ఎలాంటి విరామం లేకుండా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుందని ఎండీ తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో అనుకున్నంత మంది ప్రయాణికులు మెట్రోను ఆదరించడం లేదు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్