ETV Bharat / state

కాళేశ్వరం పర్యటక అభివృద్ధికి 300 కోట్ల నిధులు - తెలంగాణ బడ్జెట్​ వార్తలు

కేరళ తరహా పర్యటకాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఎకంగా బడ్జెట్​ లోనే నిధులు కేటాయించింది. గోదావరి పర్యటక సర్క్యూట్ ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు కేటాయింపులు చేసింది. మేడిగడ్డ, కన్నేపల్లి, అన్నారం ప్రాంతాల్లోని ఆనకట్టలు, కాల్వలు సమీపంలోని పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తు పర్యటకాన్ని అభివృద్ధి చేయనున్నారు.

కాళేశ్వరం పర్యటక అభివృద్ధికి 300 కోట్ల నిధులు

author img

By

Published : Mar 9, 2020, 7:02 AM IST

కాళేశ్వరం పర్యటక అభివృద్ధికి 300 కోట్ల నిధులు

కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణి ప్రణాళికలో కీలకమైన కాళేశ్వర ప్రాజెక్టు ఫలితాలు ఇప్పటికే అందుతున్నాయి. దశల వారీగా ప్రాజెక్టును పూర్తిచేసి పూర్తిస్థాయి ఫలాలు అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడాది పొడవునా గోదావరి నది దాదాపు 150 కిలోమీటర్ల మేర సజీవంగా ఉండనుంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలు, కాల్వల పరిసరాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం సహా ఇతర పుణ్య క్షేత్రాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలన్నింటిని ఉపయోగించుకుని అనుకూలతలను సద్వినీయోగం చేసుకుని పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

పర్యటక ప్రాంతంగా అభివృద్ధి..

సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి పారుదల, పర్యటక శాఖల అధికారులతో పాటు ఆర్కిటెక్టులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నమూనాలను తయారు చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం బడ్జెట్​లో నిధులు కేటాయించింది. గోదావరి నది తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో గోదావరి పర్యటక సర్క్యూట్ ప్రాజెక్టును చేపట్టింది. సర్క్యూట్ కోసం రూ. 300 కోట్లను బడ్జెట్​లో ప్రతిపాదించింది.

మేడిగడ్డకు అభివృద్ధికి 105 కోట్లు:

పర్యటక అభివృద్ధి కోసం మేడిగడ్డ వద్ద చేపట్టే పనులకు రూ. 105 కోట్లు కేటాయించారు. కన్నెపల్లి ప్రాంతంలో చేపట్టే పనులకు రూ. 80 కోట్లు కేటాయించారు. కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మి పంపు హౌజ్ నుంచి అన్నారం వద్ద ఉన్న సరస్వతి ఆనకట్ట వరకు 13 కిలోమీటర్ల మేర గురుత్వాకర్షణ కాలువ ఉంది. ఈ కాలువ పొడవునా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 40 కోట్లు కేటాయించారు. అన్నారం వద్ద ఉన్న సరస్వతి ఆనకట్ట వద్ద పర్యటక సంబంధిత పనులు చేపట్టేందుకు రూ. 25 కోట్ల నిధులు కేటాయించారు.

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.