సికింద్రాబాద్లోని మహంకాళీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.30 లక్షల చోరీ జరిగింది. బంగారం దుకాణం నుంచి మరో షోరూంకు నగదు తీసుకెళ్తున్న వ్యక్తి కళ్లలో స్ప్రే కొట్టి డబ్బు అపహరించుకుపోయారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
శ్రీనివాస వర్మ అనే వ్యక్తి జనరల్ బజార్లో రోహిత్ జ్యూవెలర్స్ పేరుతో బంగారం ఆభరణాలు తయారుచేసి ఆర్డర్లపై ఇతర షోరూంలకు అందిస్తుంటారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన దుకాణానకి ఎదురుగా ఉండే బంగారం షోరూం నుంచి రూ.30 లక్షల నగదు తీసుకురమ్మని రూపరాం అనే వ్యక్తిని పంపించాడు. మొదటి అంతస్తు మెట్లు దిగుతుండగా మధ్యలోనే రూపరాంను అడ్డగించిన దుండగుడు కళ్లలో పెప్పర్ స్ప్రేకొట్టి నగదు సంచి లాక్కొని పరారయ్యాడు. బాధితుడు తెరుకునేలోపే ద్విచక్రవాహనంపై అక్కడ నుంచి ఉడాయించాడు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ