మూడు కరుడుగట్టిన దొంగల ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఎన్నో సార్లు కటకటాల్లోకి వెళ్లొచ్చిన మొత్తం 8 మంది నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కత్తులు, 10 చరవాణులు, 3 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి చేసిన దాడుల్లో నిందితులు పట్టుబడ్డట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పాతబస్తీ కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఓబేద్.. అతని అనుచరుడు అబ్దుల్ లతీఫ్‌తో కలిసి షాలిబండ వద్ద దోపిడీ చేసేందుకు సిద్ధమై అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు.
ఛత్రినాకలోని ఉప్పుగూడకు చెందిన నరేష్, కుమార్‌లు ద్విచక్రవాహనంపై తిరుగుతూ ప్రజల చేతిలో చరవాణులు లాక్కెళ్తుండగా... పోలీసులు పట్టుకున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి వాసులు మహ్మద్ అక్భరుద్దీన్ అతని ముగ్గురు అనుచరులు చరవాణులు చోరీ చేస్తుండగా... దాడి చేసి అరెస్టు చేశారని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్