ETV Bharat / state

ఫెరారీ కారు కాజేసేందుకు ప్లాన్.. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్​

నకిలీ పత్రాలతో విలువైన కారును కాజేయాలని చూసిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్​ కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. ఖరీదైన కారు కొన్న యజమాని పేరు మీద రిజస్ట్రేషన్​ చేయాలని ఇచ్చిన పత్రాలను తమపేరుమీద రిజిస్టర్​ చేయించుకున్నారు.

3 men arrested for duplicate registration for Ferrari car
ఫెరారీ కారును కాజేయాలనుకున్న ముగ్గరు వ్యక్తులు అరెస్ట్​
author img

By

Published : Jun 30, 2020, 7:10 PM IST

నకిలీ పత్రాలతో రూ.2 కోట్ల విలువైన ఫెరారీ కారును కాజేయాలనుకున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్​ కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన జెస్సిక్ వద్ద దివేశ్​ గాంధీ ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. తన పేరిట కారును రిజిస్ట్రేషన్ చేయించుకురమ్మని నీరజ్ శర్మ అనే బ్రోకర్​కు కారు పత్రాలు అందజేశారు. ఎలాగైనా కారును సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి బ్రోకరే తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.

దివేశ్ గాంధీ అమెరికాకు వెళ్లిపోవటం వల్ల... కొన్ని రోజుల తర్వాత కారు రిజిస్ట్రేషన్ గురించి అడగ్గా నీరజ్​ శర్మ బుకాయించాడు. కారు తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నానని కారును తనకు ఇచ్చేయాలని నీరజ్ శర్మ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని దివేశ్​ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీరజ్ శర్మ కుట్రపూరితంగా వ్యవహరించి అక్రమంగా కారును తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కారు మాత్రం దివేశ్ గాంధీ వద్దనే ఉందని తెలిపారు. ఈ ముఠాలో సభ్యులుగా ఉన్న దిల్లీకి చెందిన భూపేందర్, సద్దాం, నీరజ్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తయిన అనంతరం మరికొంత మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ మధుకర్ స్వామి తెలిపారు.

ఇదీ చూడండి:భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ తమిళిసై అభినందనలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.