ETV Bharat / state

దేశంలో విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాల్లో మూడు మనవే! - Himru Weaver Siddipet

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు- సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది.

3 from Telugu states have been selected in UNESCO list of 50 iconic Indian heritage textiles
మన చేనేత.. చరిత్ర, సంప్రదాయాల కలబోత
author img

By

Published : Oct 1, 2022, 6:57 AM IST

Updated : Oct 1, 2022, 7:14 AM IST

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు- సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది. అందులో తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రధానంగా కనిపించే హిమ్రూ నేత, సిద్దిపేట గొల్లభామ నేత, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు స్థానం పొందాయి.

నల్లగొర్రెల గొంగడి:

....

ల్లగొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కురుమ సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, వారి జీవితంలో అంతర్భాగంగా మారాయి. ఈ ప్రాంతంలో లభించే స్వదేశీ గొర్రెల నుంచి మాత్రమే నల్ల ఊలు లభ్యమవుతుంది. మహిళలు ఈ ఊలును సంప్రదాయ పరికరాలతో దారంగా మారుస్తారు. పురుషులు గొంగళ్లు నేస్తారు. ప్రతి గొంగడికీ ప్రత్యేక అంచు (బార్డర్‌) ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా కొత్తగా ఎన్నో వాణిజ్యావసరాలు పుట్టుకురావడంతో కురుమలు వీటిని ఇప్పుడు పట్టణ వినియోగదారుల కోసం నేస్తున్నారు. యోగా మ్యాట్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు సంప్రదాయ గొర్రెల పెంపకం తగ్గించి మాంసం ఎక్కువ ఇచ్చే జాతులను పెంచుతుండటం వల్ల ఊలు తగ్గిపోయింది’’ అని యునెస్కో విశ్లేషించింది.

గొల్లభామ చీరలు: సిద్దిపేట గొల్లభామ నూలుచీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. వీటికి విశిష్ట భౌగోళిక గుర్తింపు ఉంది. సిద్దిపేట కేంద్రంగా అదే పేరుతో 1960లో ఏర్పడిన హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ చీరల మార్కెటింగ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఒకప్పుడు ఈ చీరలు నేసే నిపుణులు 2 వేల మంది దాకా ఉండేవారు. ఇప్పుడా సంఖ్య రెండు డజన్లకు పడిపోయింది. ఈ చీరలకు స్థానిక సంప్రదాయంలో కీలక భూమిక ఉంది. నేతకారులకు మద్దతిచ్చి, చేనేతకళను రక్షించడానికి సాయపడాలి. చీరలపై గొల్లభామ బొమ్మలు నేయడానికి అత్యంత నైపుణ్యం, ఓపికా ఉండాలి. దశాబ్దాలుగా ఈ కళ చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం 25 మంది నిపుణులు మాత్రమే ఈ రంగంలో మిగిలారు.

‘హిమ్రూ’ ఎలా వచ్చిందంటే..

...

‘‘హిమ్రూ అనే పదం పర్షియన్‌ భాషలోని హమ్‌-రు అన్న పదం నుంచి వచ్చింది. అంటే ఒకేలా ఉండటం అని అర్థం. కిన్‌ఖ్వాబ్‌ సిల్క్‌ వస్త్రానికి ప్రత్యామ్నాయంగా అచ్చం దానిలా కనిపించేలా నూలు, ఊలుతో నేయడంవల్లే దీనికి హిమ్రూ నేత కళగా పేరొచ్చింది. మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ దీన్ని ఔరంగాబాద్‌కు తీసుకొచ్చారు. తర్వాత హైదరాబాద్‌ పాలకులు నిజాంల షేర్వానీలకు అవసరమైన వస్త్రాన్ని ఈ కళ ద్వారా తయారుచేయించుకున్నారు. నిజాం పాలన అంతమయ్యాక 60వ దశకం నుంచి క్రమంగా నేతకళకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. దీనిపై ఆధారపడ్డ కళాకారులు ఇతర వృత్తుల్లోకి మళ్లారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2022, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.