ETV Bharat / state

రాష్ట్రంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం రెండో రోజూ సెంచరీ దాటేశాయిగా - telangana assembly election 2023

2nd Day Nominations in Telangana 2023 : రాష్ట్రంలో నామినేషన్ల జోరు ఊపందుకుంది. పార్టీలు బీ-ఫారాలు అందజేయడంతో.. అభ్యర్థులు తమ బలగంతో జోష్​గా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తొలిరోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలు కాగా.. రెండో రోజు 139 దాఖలయ్యాయి.

MLA Candidates Nominations in Telangana
MLA Candidates Nominations For Elections In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 8:00 PM IST

MLA Candidates Nominations For Elections In Telangana రాష్ట్రంలో జోరందుకున్న నామినేషన్లు బలగాలతో వచ్చి నామినేషన్లను దాఖలు చేస్తున్న అభ్యర్థులు

2nd Day Nominations in Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఒకవైపు పార్టీలు బీ-ఫామ్‌ ఇచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో.. అభ్యర్థులు నామినేషన్ల వేసేందుకు బలగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలిరోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. రెండో రోజూ 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. హంగు ఆర్భాటం లేకుండా.. ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ వేశారు. బుల్లెట్‌పై వెళ్లి నామినేషన్​ వేయడంతో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Telangana Assembly Election Arrangements 2023 : నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా

Karimnagar Elections Nominations : కరీంనగర్‌ జిల్లాలో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి ఇదివరకే.. మూడు నామినేషన్లు రాగా.. ఈరోజు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌లు వేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నామినేషన్ వేశారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నామినేషన్ పత్రం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేశారు.

Election Nomination With Coins Officer Rejects : కాయిన్స్ వల్ల కష్టాలు.. ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్

హనుమగొండలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ : హనుమకొండ జిల్లాలో రెండోరోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వరంగల్‌ పశ్చిమ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా కోరం కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అనుచరులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

Pocharam Srinivas Reddy Nomination in Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరఫున నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్ మండలానికి చెందిన న్యాలపట్ల ప్రణయ్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ సమర్పించారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రజ్ఞకుమార్ నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Cemetery Caretaker in Election : ఎన్నికల బరిలో 'కాటికాపరి'.. లక్ష మృతదేహాలకు అంత్యక్రియలు! చిల్లరతో వచ్చి నామినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.