ETV Bharat / state

2BHK Distribution in GHMC Today : నేడు 'డబుల్' ఇళ్ల పంపిణీ.. కొత్త ఇంట్లో 11,700 మంది లబ్ధిదారుల గృహప్రవేశం - జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ

2BHK Distribution in GHMC Today : తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలని.. వాళ్లకూ సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేశారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు రంగం సిద్ధమైంది. శనివారం రోజున జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11వేల 700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లను అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

2BHK in Hyderabad
2BHK Distribution in GHMC Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 5:33 AM IST

Updated : Sep 2, 2023, 6:41 AM IST

2BHK Distribution in GHMC Today : గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఒకేసారి భారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శనివారం రోజున (సెప్టెంబర్ 2) డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో.. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, పీ.మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులు ఆయా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11,700 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.

ఏయే ప్రాంతాల్లో 'డబుల్' ఇళ్లను లబ్ధిదారులకు ఎవరు అందజేస్తారంటే..?

Double Bed Room Houses Distribution in GHMC : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో గాజుల రామారం, బహదూర్ పల్లి, డి-పోచంపల్లిలో మొత్తం 1,700 గృహాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గాజులరామారంలో నిర్మించిన 144 ఇళ్లను.. బహదూర్‌పల్లిలో నిర్మించిన 356 గృహాలను.., కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 500 మందికి పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లిలో నిర్మించిన 1,200 గృహాలను.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్దిదారులకు, సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కూకట్ పల్లి నియోజకవర్గం కు చెందిన 500 మందికి మొత్తం 1700 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

2BHK Distribution in Hyderabad : మంఖాల్-1 లొకేషన్‌లో నిర్మించిన 2230 ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) డబుల్ ఇళ్లను పంపిణీ చేస్తారు. మాంఖాల్-1 లో నిర్మించిన 500 గృహాలను మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు.. మాంఖాల్-2 లో నిర్మించిన 1,730 ఇళ్లను మలక్ పేట్, యాకత్ పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

Etela Rajender Inspected Double Bedroom Houses : 'డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం నాసిరకంగా నిర్మిస్తోంది'

2BHK Distribution in Medchal : చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నెం.82, 83/పి లొకేషన్లలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రెండు పడక గదుల ఇళ్ల(2BHK Scheme Telangana)ను పంపిణీ చేస్తారు. బహదూర్‌పుర నియోజకవర్గం పరిధిలోని ఫారూక్ నగర్‌లో నిర్మించిన 770 గృహాలను ఎంపిక చేసిన లబ్దిదారులకు మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేయనున్నారు. బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన వారికి.. ఫారూక్ నగర్ లో నిర్మించిన 500 ఇండ్లను బహదూర్ పుర నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

2BHK Distribution in Rangareddy : రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని నార్సింగి, బైరాగి గూడ-2 లొకేషన్లలో నిర్మించిన 356 ఇళ్లను పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తారు. అందులో నార్సింగి సర్వే నెం.117 లో నిర్మించిన 196 గృహాలు, బైరాగి గూడ-2 లో నిర్మించిన 160 గృహాలు మొత్తం 356 మంది లబ్దిదారులకు అందజేస్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నల్లగండ్ల సర్వే నెం.125 లొకేషన్‌లో నల్లగండ్ల సర్వే నెం. 125 కాలనీకి చెందిన 216, సాయినగర్ హఫీజ్ పేట్‌కు చెందిన 168 ఇళ్లను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేస్తారు.

MLA Raghunandan Rao Latest Comments : రంగులు వెలిసిపోయినా.. పేదవానికి ఇళ్లు రావట్లేదు!

2BHK Scheme in Telangana : పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూర్-1 లొకేషన్‌లో 3,300 మంది లబ్దిదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao Distributes 2BHK) పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1 కాలనీకి చెందిన-1500, ఖైరతాబాద్ నియోజకవర్గం-200, జూబ్లీహిల్స్-500, శేరిలింగంపల్లి-156, రాజేంద్రనగర్-144, పటాన్ చెరు-500, అమీన్ పూర్-2లో- 1800, గోషామహల్ -500, నాంపల్లి- 500, కార్వాన్-500, ఖైరతాబాద్ 300 ఇళ్లను మంత్రి హరీశ్ రావు లబ్దిదారులకు అందజేస్తారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్ గూడ లొకేషన్‌లో 1500 మంది లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేస్తారు. మల్కాజ్‌గిరి -500, ముషీరాబాద్ -500, సికింద్రాబాద్ -500 మంది లబ్దిదారులకు అందజేస్తారు. ఉప్పల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ లొకేషన్‌లో 500 గృహాలను జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(GHMC Mayor Vijayalakshmi)... ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు అందజేస్తారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప్ సింగారం లొకేషన్ లో 1000 గృహాలను డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు.. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్దిదారులకు అందజేయనున్నారు.

KTR Review Meeting on Double Bed Room Houses : 'ఐదు దశల్లో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణి.. వచ్చే వారంలో మొదటి దశ ప్రారంభం'

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​

Last Updated : Sep 2, 2023, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.