ETV Bharat / state

జీతం, హోదా లేని ఎక్సైజ్​ సబ్​ఇన్​స్పెక్టర్లు.. ఇలాంటి పోస్టులు కూడా ఉంటాయా..!

author img

By

Published : Sep 8, 2021, 2:45 PM IST

ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేదు.. అధికారి అన్న హోదా లేదు. నెలలు తరబడి విధులు నిర్వహిస్తున్నా జీతం లేదు.. కేసును ఛేదించినా సంతకం చేసే బాధ్యత లేదు. కనీసం ఉద్యోగిగా గుర్తింపు లేదు. ఉంటుందో ఊడుతుందోనన్న భయంతో జీత భత్యాలు లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు 73 మంది ఎక్సైజ్​ సబ్​ఇన్​స్పెక్టర్లు. తెలంగాణలో 73 మంది ఎక్సైజ్ సబ్​ఇన్​స్పెక్టర్లకు జీతాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో 194 మంది ఎక్సైజ్ ఎస్​ఐలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి అధికారాలు ఇవ్వడం లేదు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం కంటే... అవమానాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి.

excise sub inspectors
excise sub inspectors

ఎక్సైజ్‌ శాఖలో 280 సబ్​ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. గ్రూపు-2 కింద 267 మంది ఎక్సైజ్ ఎస్​ఐలుగా ఎంపిక కాగా... వారికి గతేడాది జనవరిలో శిక్షణ మొదలైంది. ఇంతలో కొవిడ్​ మొదటి దశ విజృంభణతో 6 నెలల శిక్షణా తరగతులను రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు కుదించింది. ఈ సమయంలో కొవిడ్​ ఉద్ధృతి మరింత పెరగడం వల్ల 45రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని కూడా నిలిపేశారు. అయితే నిబంధనల ప్రకారం మరో 45రోజులు శిక్షణ పూర్తి చేస్తేకాని వారికి డ్యూటీ కేటాయించడం కుదరదు.

శిక్షణ పూర్తికాకుండానే విధుల్లోకి

కొవిడ్​ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఎంపికైన వారికి శిక్షణ పూర్తి కాకుండానే ఎక్సైజ్​శాఖ పోస్టింగ్​ ఇచ్చింది. వీరు నియమితులయ్యే సమయానికి పలువురు సీనియర్‌ అసిస్టెంట్లకు, హెడ్‌కానిస్టేబుళ్లకు సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించింది. దీనితో 267 మందిలో 87 మందికి మినహా మిగిలిన వారికి ఎక్సైజ్​శాఖ పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇక్కడో చిక్కొచ్చి పడింది. పోస్టింగ్​లు ఇవ్వని వారికి జీతాలు చెల్లించడం కష్టమవుతుందని భావించిన సర్కారు... 2020 జనవరిలో సంవత్సర కాలం గడువుతో 87 సూపర్​ న్యూమరీ పోస్టులను సృష్టించింది. ఈ ఏడాది కాలంలో కొంతమంది ఎస్సైలు పదవీ విరమణ పొందడంతో కొందరికి పోస్టింగ్​లు వచ్చాయి. ఏడాది గడువు ముగిసినా పోస్టింగ్​లు లేక 73మంది మిగిలారు. వీరికి పోస్టింగ్​లు ఇవ్వకపోవడం వల్ల జీతాలు అందడం లేదు. మరో వైపు వీరందరిని వివిధ ఎక్సైజ్​ స్టేషన్లకు అటాచ్‌ చేసి విధులు నిర్వర్తించుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ జీతాలు రాక.. కుటుంబ పోషణ భారమై.. అధికారులు చెప్పినట్లు చేయకపోతే ఉద్యోగాలు పోతాయనే భయంతోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉద్యోగం ఉన్నా... హోదా లేదు

ఇదిలా ఉండగా 267 మంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొందకపోవడం వల్ల వీరు పేరుకే సబ్​ఇన్​స్పెక్టర్లు. శిక్షణ కాలం పూర్తికాకపోవడం వల్ల చట్టపరంగా వీరికి బాధ్యతలు లేవు. కేసులు నమోదు చేసినా, దర్యాప్తు చేసినా వాటిలో వీరు సంతకాలు చేయడానికి వీలులేదు.

ఇప్పటికైనా గుర్తించండి

కొవిడ్​ ఉద్ధృతి తగ్గినందున తమ మిగిలిన శిక్షణా కాలాన్ని పూర్తి చేసి అధికారంతో కూడిన ఉద్యోగాలు, జీతాలు సక్రమంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ను కలిసి వినతిపత్రం అందించారు.

ఇదీ చూడండి: రానున్న 3నెలలు మీరు మరింత కృషి చేయాలి : సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.