Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త శాంతించింది. నిన్న, మొన్నటి వరకు భారీగా నమోదైన కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. రాష్ట్రంలో తాజాగా 2484 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి కోలుకుని మరో 4,207 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో రివకరీ రేటు 94.38 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 38,723 హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆ దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్!