రాష్ట్రంలో మరో 2,239 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,83,866కు చేరింది. వైరస్‌తో కొత్తగా 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,091కి పెరిగింది. తాజాగా కొవిడ్ నుంచి 2,281 మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,52,441 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 30,334 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 24,683 మంది కొవిడ్ బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన వారిలో చాలా స్వల్పంగానే మరణిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 28 లక్షల 761 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 ప్రైవేటు, 17 ప్రభుత్వ ల్యాబుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా 1076 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడినవారిలో దాదాపు 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోగా కేవలం 30 శాతం మందిలోనే వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 316, ఆదిలాబాద్ 27, భద్రాద్రి కొత్తగూడెం 91, జగిత్యాల 54, జనగామ 35, జయశంకర్ భూపాలపల్లి 29, జోగులాంబ గద్వాల 29, కామారెడ్డి 60, కరీంనగర్ 106, ఖమ్మం 73, కుమురం భీం ఆసిఫాబాద్ 12, మహబూబ్‌నగర్ 34, మహబూబాబాద్ 57, మంచిర్యాల 31, మెదక్ 31, మేడ్చల్ మల్కాజ్గిరి 164, ములుగు 33, నాగర్ కర్నూల్ 43, నల్గొండ 141, నారాయణపేట 34, నిర్మల్ 31, నిజామాబాద్ 69, పెద్దపల్లి 32, సిరిసిల్ల 57, రంగారెడ్డి 192, సంగారెడ్డి 66, సిద్దిపేట 79, సూర్యాపేట 63, వికారాబాద్ 29, వనపర్తి 35, వరంగల్ రూరల్ 37, వరంగల్ అర్బన్ 91, యాదాద్రి భువనగిరి జిల్లాలో 58 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: సంగీత ప్రపంచం మరువలేని మహా మనీషి 'బాలు'