ETV Bharat / state

ఈనెల 20 నుంచి హెచ్‌సీయూ ఆన్‌లైన్‌ తరగతులు! - హెచ్​సీయూలో ఈనెల 20 నుంచి ఆన్​లైన్​ తరగతులు

కరోనా ప్రభావం ఈ విద్యాసంవత్సరంపై పడకుండా ఉండేందుకు హెచ్​సీయూ ఆన్​లైన్​ తరగతులను ప్రారంభించనుంది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని వర్సిటీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతిపాదన చేసింది. 10 నుంచి పీహెచ్‌డీ పరిశోధనలు చేసుకునేందుకు వీలు కల్పించింది.

20th onwards online classes start at hyderabad central university
ఈనెల 20 నుంచి హెచ్‌సీయూ ఆన్‌లైన్‌ తరగతులు!
author img

By

Published : Aug 3, 2020, 2:32 PM IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని వర్సిటీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పట్లో తరగతి గది బోధనకు వీల్లేకపోవడం, ఆగస్టు 31వరకు విద్యాసంస్థలు మూసి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టాలని వర్సిటీ భావిస్తోంది.

రానున్న విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే విషయమై వీసీ ప్రొ.అప్పారావు.. వర్సిటీ ఎస్‌ఎన్‌ స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆచార్యుడు వినోద్‌ పావరాల అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఆచార్యులు, వివిధ విభాగాల అధిపతుల నుంచి ఈ మెయిల్‌ ద్వారా సలహాలు, సూచనలను కమిటీ సభ్యులు స్వీకరించారు. వీటిపై చర్చించి 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని సూచించారు.

పేద విద్యార్థుల మొబైల్‌ డాటా ప్యాక్‌లు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా నెలకు రూ.1000 చొప్పున వర్సిటీ తరఫున ఇవ్వనున్నారు. విద్యార్థులకు నిర్వహణ ఖర్చుల కోసం వర్సిటీ తరఫున ఇచ్చే బీబీఎల్‌ ఉపకారవేతనాన్ని డిజిటల్‌ యాక్సెస్‌ గ్రాంట్‌గా మార్చి విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని కమిటీ సూచించింది. ఆన్‌లైన్‌ బోధనలో భాగంగా ఎక్కువగా ప్రీరికార్డింగ్‌ వీడియోలు, ఇతర విద్యా సామగ్రి అందుబాటులో ఉంచాలని, లైవ్‌ తరగతులు రెండు రోజులకోసారి నిర్వహించాలని తెలిపింది.

ఈ సూచనలపై చర్చించేందుకు ఈ నెల 6న వీసీ అధ్యక్షతన వర్సిటీ వివిధ విభాగాల అధిపతులు, టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల సమావేశం జరగనుంది. అందులో చర్చించి కమిటీ సూచించిన తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.

హైదరాబాద్‌లోని పీహెచ్‌డీ విద్యార్థులు రావొచ్చు

హ్యుమానిటీస్‌, సైన్స్‌, సోషల్‌సైన్స్‌ విభాగాల్లో 4, 5 సంవత్సరాల్లో ఉన్న పీహెచ్‌డీ విద్యార్థులు ఈ నెల పదో తేదీ నుంచి పరిశోధనలు కొనసాగించేందుకు వర్సిటీ అవకాశం కల్పించింది. హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థులను మాత్రమే అనుమతించనున్నారు.

నెలాఖరులో మరోసారి సమీక్షించి మరికొందరిని వర్సిటీకి పిలిచేందుకు వీలుంటుందేమో కమిటీ సమీక్షించనుంది. అలాగే ఎంఫిల్‌ విద్యార్థులందరూ మరుసటి ఏడాదికి రిజిస్టర్‌ చేసుకునేందుకు వర్సిటీ అనుమతించింది. ఇందుకు డాక్టోరల్‌ కమిటీ ప్రోగ్రెస్‌ రిపోర్టు అప్‌లోడ్‌ చేయకుండానే సూపర్‌వైజర్‌ సర్టిఫై చేస్తే చాలని, ఫీజు ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదని వర్సిటీ సూచించింది. వీరు ఇంటి నుంచే పరిశోధన కొనసాగించవచ్ఛు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.